Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో కరోనా నివారణకు సహాయ చర్యల్లో భాగంగా డివిజన్లో ఆయా కాలనీల్లో శుక్రవారం హైపో క్లోరైడ్ రసాయన ద్రావణాలను పిచికారీ చేశారు. ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా వచ్చిందని ఎవరూ అధైర్య పడొద్దన్నారు. భౌతికదూరం, మాస్క్, శానిటైజర్‌ను అనునిత్యం వాడుతూ ఉండాలని సూచి ంచారు. కరోనా రోగుల సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ జనరల్ సెక్రెటరీ సందీప్‌రెడ్డి, బీజైవైఎం ఉపాధ్యక్షులు సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.