Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని హైదర్‌నగర్ డివి జన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలొని హెచ్ఎంటీ హిల్స్కాల నీలో నూతనంగా నిర్మిస్తున్న తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా కొర్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ విషయ ంలో ఎక్కడా రాజీ పడకూడదనీ, ప్రజా అవసరాల దృష్ట్యా పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య తన దృష్టికి వచ్చినా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాన న్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇస్పెక్టర్ మహదేవ్, డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ అసోసియేషన్ సభ్యులు గోపిచంద్, మోహన్‌రావు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.