Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఆస్పత్రులకు వెళ్లేందుకు అవకాశంలేక ఇంటివద్దనే వైద్యసేవలు పొందాలనుకునే వారికి ఇంటివద్దకే డాక్టర్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు 'కాల్ హెల్త్' నిర్వాహకులు తెలిపారు. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ రోగులకు అవసరమైన వైద్య సేవలు, టెస్టులు అందిస్తామని పేర్కొన్నారు. కాల్ హెల్త్ రోగులు తమ అవసరాలను బట్టి కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, గైనిక్ వంటి నిపుణులతో సంప్రదించే అవకాశాన్ని సులువుతరం చేస్తోందన్నారు. వాస్తవ ఆధారితంగానే చార్జీలు ఉంటాయని తెలిపారు. 650 మిలియన్ల వినియోగదారులకు సేవ చేయడమే లక్ష్యంగా వెయ్యి నగరాలు, పట్టణాలలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.