Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల మధ్యన చేపల మార్కెట్వద్ద ప్రవహించే ప్రధాన నాలాలో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వెళ్లి పరిశీలించారు. నాలాలో స్థానిక పరిశ్రమల నుండి వచ్చే థర్మకోల్, కెమికల్ వ్యర్థాలు వంటివి పేరుకుపోయి మురుగు నీటి ప్రవాహానికి అడ్డుగా నిలిచాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్తాగి పడేయడంవల్ల ఈ మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను ఆర్పివేశారు.