Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్‌లోని శ్మశాన వాటికలో కొత్త టెక్నాలజీతో తయారు చేసిన డీజిల్, గ్యాస్ ఆధారిత దహనవాటికను ఏర్పాటు చేశారు. దీనిని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, ఉప కమి షనర్ రవికుమార్‌లు సందర్శించి పరిశీలించారు. దాని పనివిధానాన్ని అడిగి తెలుసుకున్నారు. న్యూ టెక్నాలజీతో రూపొందిన ఈ దహన వాటికి ద్వారా, పొగ, వాసన వంటివి లేకుండా విద్యుత్ దహన వాటిక కంటే తక్కువ నిర్వహణ ఖర్చులతో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారం. కార్యక్రమంలో ఈఈ, డిప్యూటీ ఈఈ, ఏఈ కాంట్రాక్టర్ పాల్గొన్నారు.