Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసులను ఇంటి నుంచే పర్యవేక్షించే విధంగా 'వర్క్ ఫ్రమ్ హౌం'కు ప్రభు త్వం అవకాశం కల్పించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రవీందర్, బి.రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని ప్రజలు స్వీయ నియంత్రణ పాటిం చాలనీ, ఇంట్లో అందరూ మాస్కులను ధరించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తాజాగా చేసిన ప్రకటన అందరినీ కలవరపెడుతోందని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో ఉపాధ్యా యులు స్కూళ్లకు హాజరు కావడం వల్ల వారి ప్రాణాలకు ముప్పుతో పాటు కుటుంబ సభ్యులకు ప్రమాదమేనని తెలిపారు. కరోనా వంటి ఈ విప త్కర పరిస్థితుల్లో చాలామంది టీచర్లు పాఠశాలలకు హాజరు కావాల్సి రా వడంతో వైరస్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి డిజిటల్ పాఠాలు టీచర్లు ఇండ్ల నుంచే పర్యవేక్షించేలా అనుమతించాలని, తక్షణమే దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.