Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజల ఆరోగ్య పై బోడుప్పల్ కార్పొరేషన్ పాలక వర్గానికి అస్సలు పట్టింపులేకుండా పోయిందనీ, ఇంత పెద్ద కార్పొరేషన్లో ఒక్క చోట కూడా కరోనా వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయలేదంటే పాల కులకు ప్రజారోగ్యంపై ఎంత పట్టింపు ఉందో అర్ధం చేసుకోవచ్చని కాంగ్రెస్ బోడుప్పల్ కార్పొరేషన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందుకూరి నవీన్ అన్నారు. ఈ మేరకు ఆయన బోడుప్పల్లో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. రూ.కోట్లు ఆదాయం కల బోడుప్పల్ కార్పొరేషన్ లో పాల కుల నిర్లక్ష్యం కారణంగా వ్యాక్సిన్ సెంటర్ లేకుండా పోయిందన్నారు. ఖచ్చితంగా వాక్సిన్ ఇవ్వాలని ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబు తుంటే బోడుప్పల్ కార్పొరేషన్ అధికారులు, పాలక మండలి సభ్యులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిత్యం కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటంతో దానికి ఆనుకుని ఉన్న కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, కరోనా పరీక్షల కేంద్రాన్ని ఇక్కడ నుంచి మార్చాలని కోరారు.