Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఆర్థిక సేవల రంగంలో అగ్రగామి, సుప్రసిద్ధ పిన్టెక్ కంపెనీ లెండింగ్ కార్ట్ దేశంలో మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఎమ్.ఎస్.ఎమ్.ఈలతో కలిసి పని చేయడంతో పాటు వారికి ఆర్థికంగా ఎదిగేందుకు రుణ సదుపాయాలు అంది ంచి, వ్యాపారాల్లో వృద్ధి సాధించేందుకు తోడ్పాటు అందిం చనుంది. లెండింగ్ కార్ట్ ఇప్పుడు 15 మిలియన్ యూఎస్ డాలర్లను, డచ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఎఫ్ఎంఓ ఎంటర్ ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధు లు సమీకరించి, మహిళా పారిశ్రామిక వేత్తలకు సహకారం అందిస్తోంది. లెండింగ్ కార్ట్ సీఈవో అండ్ కో ఫౌండర్ హర్షవర్ధన్ లునియా మాట్లాడుతూ.. మహిళలను శక్తిమం తులుగా మార్చాలని భారతీయ ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలలో మహిళలు ఆల్ రౌండర్ లుగా గెలవాలని, అన్ని విధాల ఆర్థిక సహాయం అంద చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే దేశంలో మొత్తం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు 12 శాతం మహిళలు నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో అనేకమంది లెండింగ్ కార్ట్ ద్వారా రుణం పొంది అభివృద్ధి దిశగా సాగుతున్నారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని మహిళా వ్యాపారవేత్తలు వినియోగించుకోవాలని సూచించారు.