Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వార్డు కార్యాలయం కేటాయించాలని రెండు నెలలుగా అడుతున్నా ఇవ్వకపోవడంతో శుక్రవారం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ -8లో ఆ వార్డు కార్యాలయం ఆరు బయటనే ప్రజా వినతులను తీసుకుంటూ హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ మండుటెండల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇద్ద రు కార్పొరేటర్లు ఇక్కడి నుంచి వార్డు కార్యాలయంలో విధు లు నిర్వర్తించారనీ, మొన్నటి వరకు స్థానిక ఎమ్మెల్యే సుబా ష్ రెడ్డి సతీమణి స్వప్న కూడా కార్పొరేటర్‌గా ఇక్కడ నుంచే పని చేసినట్టు ఆమె గుర్తు చేశారు. మరి తమకు ఇక్కడే కేటాయించలని కోరినా ఇవ్వకపోగా ఇతర చోట కమ్యూటీ హల్ కేటాయిస్తామని అధికారులు చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. తమకు ఇక్కడే కార్యాలయం కేటాయించే వర కు ఆరు బయట నుంచే ప్రజల నుంచి వినతులు స్వీకరిసా ్తనని స్పష్టం చేశారు. ఇంకో వైపు ఈ కార్యక్రమం ఇక్కడ స్థానికుల అందరికీ తెలుసు అనీ, అందరికీ అందుబాటు లో, ఆమోదయోగ్యమైనది అని చేతన హరీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కక్కిరేణి హరీష్, ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీ ణ్, సీనియర్ నాయకులు సంజరు, పటేల్ రవీందర్‌రెడ్డి, రంగరవి, సుమన్‌రావు, గాదె శ్రీనివాస్, రాగి వెంకట్‌రెడ్డి, నోముల శాంతకుమార్, పాశం ప్రవీణ్, పాండునాయక్, పడతియ నాయక్, దారం వెంకట్ గుప్తా, శివగౌడ్ లక్ష్మి, భాస్కర్, ఉపేందర్ పాల్గొన్నారు.