Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, వత్తిపర మైన ఎన్నో సమస్యలతో పోరాడుతూ కూడా నవసమాజ స్థాపనకు మీడియా అహర్నిశలూ కృషి చేస్తోందని ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో కొత్తగా ప్రారంభించిన ఏవీ న్యూ స్ ఛానల్ లోగోను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హను మంతరావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లా డుతూ.. విపత్కర పరిస్థితుల్లో కూడా సీనియర్ జర్నలిస్టు బొమ్మ అమరేందర్ న్యూస్ ఛానల్ ప్రారంభించడం హర్షణీయం అన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా నిలుస్తూ సమాజ హితం కోసం మీడియా కషి చేస్తుంద న్నారు. జర్నలిస్టులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించ లేమని చెప్పారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. 19 వేల మందికి అక్రిడేషన్ కార్డులు అందించిన ఘనత ప్రభుత్వానిదేన న్నారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం మీడియా కషి ఎంతో అభినందనీయమన్నారు. ఏవీ న్యూస్ ఛానల్ చైర్మెన్ బొమ్మ అమరేందర్, దమ్మాయిగూడ మున్సి పల్ చైర్మెన్ ప్రణీత శ్రీకాంత్‌గౌడ్, డిప్యూటీ చైర్మెన్ నరేందర్ రెడ్డి, ఏఎస్‌రావ్‌నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశే ఖర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ వలందాసు సునీత, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదిత రులు పాల్గొన్నారు.