Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని నిరుపేదల కు వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని నియోజక వర్గం సీపీఐ(ఎం) కన్వీనర్ ఎం.మహేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అంబర్పేట మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భ ంగా మహేందర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 3 వేల ఇండ్లను మాత్రమే నిర్మించిందనీ, వాటిని కూడా నగరం వెలుపల కట్టించిందని తెలిపారు. వాటిని ఇప్పటి వరకు కేటా యించలేదన్నారు. నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్ల చొప్పను కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు లబ్దిదారులన పేర్లను గుర్తించలేదన్నారు. అధికార పార్టీ నాయకులు ఇండ్ల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారనీ, ప్రభుత్వ అధికారులతో నిష్పాక్షిక ంగా నిరుపేదలకు మాత్రమే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంబర్పేట నియోజకవర్గంలో నాలు గు వేల ఇండ్లను కేటాయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మోహన్, ధన్రాజ్, రాములు, డి.రాములు, రాజు, నాగమ్మ, రామకృష్ణ, భీష్మ పాల్గొన్నారు.