Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా లెక్కల్లో గందరగోళం..!
- తక్కువ చేసి చూపుతున్న సర్కార్
- అయోమయంలో సిటీజనులు
- కరోనా బులిటెన్పై అనుమానాలెన్నో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కరోనా లెక్కల్లో గందరగోళం నెలకొంది. నిత్యం కేవలం రెండు, మూడు ఏరియాల్లోనే 300కు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుంటే.. సర్కార్ మాత్రం మీడియా బులిటెన్లో గ్రేటర్ మొత్తం కలిపి 300-400గా చూపించడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం నాలుగు, ఐదు యూపీహెచ్సీలు, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రతిరోజూ 300కు పైగా కేసులు వెలు గు చూస్తున్నాయంటే.. ఇక గ్రేటర్ మొత్తం కలిపితే ఇంతకు నాలుగు రెట్లు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదని పలువురు వాపోతున్నారు. పాజిటివ్ కేసులను తగ్గించి చూపించడమేంటని సిటీజనులు ప్రశ్నిస్తున్నారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా కేసుల సంఖ్యలో వ్యత్యాసం ప్రజల్లో అయోమయానికి దారి తీస్తోంది. కేవలం ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట జోన్ల పరిధిలోని కరోనా పరీక్షా కేంద్రాల్లో చేస్తున్న రాపిడ్ టెస్టుల్లో నిత్యం 300కు పైగా పాజిటివ్ కేసులుగా నిర్దారణ అవు తున్నాయి. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ 300-400 కేసులు మాత్రమే వస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించే బులిటెన్లో చూప ిస్తున్నారు. ఒక్క ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట, సరూర్నగర్, హయత్నగర్ పరిసరాల్లోనే యూపీహెచ్సీ, ప్రభుత్వాస్పత్రులో ్లనే నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటు తుండగా, గ్రేటర్ పరిధిలో మొత్తం కలిపి 300- 400 మాత్రమే కేసులు నిర్దారణ అవుతున్నా యని ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హాట్స్పాట్లేవీ..?
వైరస్ సోకిన వారు నిర్లక్ష్యంగా బయట తిర గకుండా చూడాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వ యంత్రాంగానిదే. అవసరమైతే స్వచ్ఛం ద సంస్థలు, కాలనీ, బస్తీ సంఘాల సాయం తీసుకుని కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మలక్పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, పాతబస్తీ పరిసరాల్లో పాజిటివ్ కేసు లు నిత్యం వందలాదిగా నమోదవుతున్నా.. హాట్ స్పాటులను గుర్తించడంలో అధికారులు మీనమే శాలు లెక్కిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మురికివాడలు, బస్తీలు చాలా ఉన్నాయి. ఇక్కడ శుభ్రత పాటించకపోవడం కూడా ఎక్కువ కేసు లు నమోదు కావడానికి కారణమవుతుంది. మా ర్కెట్లు, హోటళ్లు, బార్లు, వైన్స్, బస్సులు, ఆటోలు ఇలా ఎక్కడ చూసినా కరోనా నిబంధనలు పూర్తి గా అమలకు నోచుకోవడం లేదు. కరోనా మహ్మ మారి విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ధరిం చని వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తు న్నారు. మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరి మానా విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించే వారికి ఇచ్చినట్టే ఈ చలానా జారీ చేస్తున్నారు. అయినా కొంతమంది నిబంధనల ను ఉల్లంఘించడం మాత్రం మానడం లేదు. దీంతో కరోనా ఉధృతికి కారణమవుతున్నారు.
వైద్యులకు సెలవులు రద్దు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ం నిర్ణయించింది. వైద్యశాఖ సిబ్బందికి సెలవుల ను రద్దు చేసింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రు ల్లో అదనంగా 25శాతం పడకలు పెంచాలని ఆదేశించింది. మొత్తం పడకల్లో 70శాతం కరోనా రోగుల కోసం ఉపయోగించాలని నిర్దేశించింది. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎంపిక చేసిన సాధారణ శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోవాలని సూచిం చింది. కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చేం దుకు ప్రత్యేక ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆక్జిన్ నిల్వలను అందుబాటులో ఉం చాలని సూచించింది. ప్రజలందరూ మాస్కులు విధిగా ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటించాలని.. ఏమాత్రం అశ్రద్ద చేయొద్దని కోరింది. ఇప్పటికైనా బులిటెన్లో సరైన కేసుల వివరాలను వెల్లడించా లని పలువురు కోరుతున్నారు.