Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న ఉన్న సివిల్ సప్లై కార్యాలయాన్ని శుక్రవారం ఏఎస్ఓ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ ప్రస్తుతం ఉన్న కార్యాలయం కొన్నేండ్లుగా ప్రయివేటు భవనంలో కొనసాగుతోందని తెలిపారు. కాగా భవన యజ మాని ఖాళీ చేయాలని కోరడం వల్ల ఈ విషయమై ఏఎస్ ఓ శ్రీనివాస్‌రెడ్డి స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై కార్పొరేటర్ స్పంది స్తూ కొన్నేండ్లుగా బాలానగర్‌లో ఉన్న సివిల్ సప్లై కార్యాల యాన్ని మరో ప్రాంతానికి తరలించకుండా తాత్కాలికంగా కోమటి బస్తీలో ఉన్న కమ్యూనిటీ హాల్లో కార్యకలాపాలు కొనసాగించాలని ఏఎస్ఓ శ్రీనివాస్‌రెడ్డికి చెప్పారు. అలాగే శాశ్వత కార్యాలయం కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో బాలానగర్ మెయిన్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మొహమ్మద్ ఖాజా, మొహమ్మద్ బాబా, చంద్రశేఖర్ గుప్త, శంకర్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, అభిమన్యు, తదితరులు పాల్గొన్నారు.