Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 నిమిషాల కంటే తక్కువ
- ప్రతిజ్ఞ చేసిన ఎసీసీసీ
నవతెలంగాణ-సిటీబ్యూరో/జూబ్లీహిల్స్
గుండెపోటు సంభవించిన సందర్భంలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకి అనేది ఏర్పడు తుంది. ఎంత త్వరగా అడ్డంకిని తొలగిస్తే అంత త్వరగా గుండె కండరాలకు నష్టం వాటిల్లడం అనేది తగ్గుతుంది. కోలుకునే అవకాశాలు బాగా మెరుగవుతాయి. బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ లేదా ఇతర పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ (పిసిఐ) వంటి ప్రక్రియల ద్వారా ఇరుకుగా మారిపోయిన రక్త నాళాలను విస్తరించడం ద్వారా ఏర్పడిన బ్లాక్‌ను తొలగించి తద్వారా ఆ వ్యక్తి ప్రాణా లను రక్షించడంలో అత్యంత సాధారణంగా అమలు చేసే విధానం. గుండెపోటుతో బాధపడుతున్న రోగి హాస్పిటల్ తలుపుల గుండా లోపలికి ప్రవేశించిన క్షణం నుంచి బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా ఇతర చికిత్సను పొంద టానికి తీసుకునే సమయాన్ని 'డోర్-టు-బెలూన్ సమ యం' అని అంటారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అంతర్జాతీయంగా సిఫార్సు చేసిన 90 నిమిషాల ప్రామాణిక కాలపరిమితితో పోలిస్తే, అపోలో హాస్పిటల్స్ డోర్-టు-బెలూన్ సమయాన్ని 60 నిమిషాల కంటే తక్కువగా ప్రక్రియ సమయాన్ని తగ్గించడంలో విజయవం తమయ్యాయి. ఈ మెరుగుదల సాధించడం ద్వారా అనేక మంది ప్రాణాలను రక్షించినట్లవుతుంది. హాస్పిటల్‌కు వచ్చే ప్రతి రోగితో తీసుకోవాల్సిన కోవిడ్ జాగ్రత్తలతో ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నట్లయితే మహమ్మారి పరిస్థితుల మధ్య ఈ ఘనతను సాధించడం అనేది మరి ంత ప్రశంసనీయమైనదిగా చెప్పవచ్చు. అపోలో హాస్పి టల్స్ కార్డియాలజీ, క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ దీనిపై వాఖ్యానిస్తూ, 'గుండెపోటు సంభవించిన సందర్భంలో సమయం ఆలస్యం అయ్యేకొద్దీ ప్రతి నిమి షం ఆలస్యం కారణంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉం టుంది. తద్వారా మరణం సంభవించవచ్చు. చికిత్సలో సంక్లిష్టత అనేది పెరుగుతుంది. కోవిడ్ ఫలితంగా హాస్పిట ల్కు రోగులు వచ్చే సమయం ఆలస్యం కావచ్చు. కోవిడ్ ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం మరికొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ (ఎసిఎస్) సందర్బాన్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు డోర్-టు-బెలూన్ సమయాన్ని ప్రభావితం చేసే ఆలస్యం లేదా ఏదైనా అడ్డంకిని తొలగించడానికి సమగ్ర వ్యూహం ద్వారా ఈ సవాళ్లను అధిగమించడానికి కరోనా మహమ్మారి సమయంలో డోర్-టు-బెలూన్ సమయాన్ని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి'అని అన్నారు.