Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువులో పేరుకుపోయిన గుఱ్ఱపు డెక్క కార ణంగా వృద్ధి చెందుతున్న దోమల బెడదతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, ఎంటమాలజీ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం గుర్రపు డెక్కను ఎల్లమ్మ చెరువులో ఇటాచీ సాయంతో 80 శాతం తొలగించారు. మరి కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో గుర్రపు డెక్కను తొలగిస్తామని సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.