Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోగల భాగ్యనగర్ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. మక్కెర రాజు(31) ఆటో డ్రైవర్‌గా జీవితం గడుపుతూ.. అపార్టుమెంట్లో ఇల్లు అద్దెకున్నాడు. కొన్ని రోజులుగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. ఒక యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఫ్లాట్‌లో 4 మొబైల్ ఫోన్లు, రూ. 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.