Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
సరికొత్త యాంటీ డయాబెటిక్ మాలిక్యూల్ కోసం తొలిదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సీడీఎస్ సీఓ అనుమతి కోరినట్లు మాన్ కైండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఆర్.సి.జునేజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ మార్కెట్లో అన్ని ప్రధాన థెరఫ్యూటిక్ రంగాల్లో రోగులు, వైద్యులు, ఆరోగ్య వ్యవస్థలకు మేలు చేసేందుకు తమ పోర్ట్ ఫోలియోను విస్తరించడానికి మాన్ కైండ్ ఫార్మా కట్టుబడి ఉందన్నారు. నాలుగో అతిపెద్ద ఫార్మాసూటికల్ సంస్థ (ఐక్యూవీఐఏ) ప్రకారం మాన్ కైండ్ ఫార్మా తన తొలి ఇన్వెస్టిగేషన్ న్యూ డ్రగ్ (ఐఎన్డీ) దరఖాస్తును భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ)కు సమర్పించిందన్నారు. తాము రూపొందించిన ఎంకేపీ 10241 అనే పేటెంట్ పొందిన మొట్టమొదటి నావెల్ యాంటీ డయాబెటిక్ మాల్యూల్ కు ఈ దరఖాస్తు అందిందని తెలిపారు. సీడీఎస్ సీఓ అనుమతి లభించి, తమ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తే మధుమేహ రోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తమ సంస్థ భావిస్తోందన్నారు. రక్తంలోని మధుమేహ స్థాయిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని ఆయన తెలిపారు.