Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్ పేట్
జల్పల్లి మున్సిపల్ పరిధిలోని సాదత్ నగర్లో పీస్ కమిటీ సమావేశం శుక్రవారం బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ అద్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనస్టలిపురం ఏసీపీ పురుషోతం రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మున్సిపాలిటీలోని 28వ వార్డులో జరుగుతున్న ఉప ఎన్నికలు, రంజాన్ పండుగ సందర్బంగా ఉపవాసాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు మాస్కులు దరించటంతో పాటు శానిటైజర్‌ను వాడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్, చైర్మెన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మెన్ పర్వినా నాజ్, వార్డుల కౌన్సిలర్లు, పలు పార్టీల నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.