Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడికి యావజ్జీవ శిక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత కాలం జైలు శిక్షతోపాటు రూ.15వేల జరిమానాను ఎల్బీ నగర్ కోర్టు విధించింది.. శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిల్లో నిసిస్తున్న దంపతులకు చెందిన వారి మైనర్ కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మే 2,2016లో 16ఏండ్ల అమ్మాయి తిరిగి ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కేవీఎల్ నర్సింహారావు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలో నివాసముంటున్న కె.తిరుపతి బాలికిను కిడ్నాప్ చేసినట్టు గుర్తించి అరెస్టు చేశారు. బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు ఆమెను బెదిరించి పెండ్లి చేసుకుని, తిరుపతి బంధువు ఇంట్లో బంధించి లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణతో తేల్చారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇదిలావుండగా ఇన్స్పెక్టర్ ఎస్.అశోక్ కుమార్ పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. అన్ని కోణాల్లో విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవితకాలం జైలు శిక్షతోపాటు రూ.15వేల జరిమానాను విధించారు. నిందితునికి శిక్ష పడడంతో సీపీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.