Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
నియోజకవర్గంలోని సమస్యల సత్వర పరిష్కారం కోసం అవసరమైన నిధులను కేటాయించి సాధ్యమైనంత తొందరలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. కుషాయిగూడ అరుంధతి కాలనీలో తాగునీటిలో ప్రెషర్, శిథిలావస్థకు చేరుకున్న మురుగునీటి వ్యవస్థ, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ సమస్యల పట్ల కాలనీవాసులు ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించి మాట్లాడారు. కుషాయిగూడ అరుంధతి కాలనీని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తూ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు రాజీలేని కృషిని కొనసాగిస్తామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల స్మారకార్థం కోసం సామాజిక భవనం కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు, ఏఈ సత్యలక్ష్మి, నాయకులు కాసం మహి పాల్ రెడ్డి, నాగిళ్ల బాల్రెడ్డి, మణిపాల్ రెడ్డి, ఎంపల్లి పద్మా రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అనిల్ ముదిరాజ్, కుషాయిగూడ అరుంధతి సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ, వెంకటేష్, రమేష్, మల్లేష్, చల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.