Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారా హిల్స్
నిరుపేదలకు అందుబాటు ధరలో నాణ్యమైన బంగారాన్ని అందజేస్తామని అటికా గోల్డ్ ఫౌండర్ బొమ్మనాహల్లి బాబు అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, 2 వద్ద అటికా గోల్డ్ కంపెనీ బ్రాంచీని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప, కర్ణాటక మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు హరీష్ నలపాద్ తదితర ప్రముఖులు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా బొమ్మనాహల్లి బాబు మాట్లాడుతూ అటికా గోల్డ్ భారతదేశంలో నేటికి 212పైగా బ్రాంచీలను ఆరంభించిందని తెలిపారు. పాత లేదా ఉపయోగించిన బంగారాన్ని ఆన్లైన్ మార్కెట్ విలువతో కొనుగోలు చేస్తామని వివరించారు.