Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నరేంద్రనగర్, పటేల్‌నగర్ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కలుషిత నీటి సరఫరా, లోప్రెషర్ సమస్య ఉందని దాన్ని వెంటనే వెంటనే పరిష్కరించాలని జల మండలి అధికారులను అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరుకుమార్ కోరారు. శుక్రవారం డివిజన్లోని నరేందర్నగర్, పటేల్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించి కలుషిత నీరు, లోఫ్రెషర్ నీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో లోప్రెషర్ నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు లవంగం ఆంజనేయులు, ఆమనూరి సతీష్, రగుల ప్రవీణ్ పటేల్, జాకీ బాబు, లవంగ నాగరాజు, సంతోష్ పాల్గొన్నారు.