Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
నవతెలంగాణ-కూకట్ పల్లి
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మ బండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు, డాక్టర్లు చర్యలు తీసుకున్నారని చెప్పారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్లి పేరు నమోదు చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కరోనా నియంత్రనకు దోహదపడాలని ప్రజలకు సూచించారు. అనంతరం కార్పొరేటర్ రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వాక్సిన్ తీసుకునే వారు ఏమైనా తిని రావాలని, మొబైల్ ఫోన్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తమతో తీసుకురావాలని సూచించారు.