Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తానని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో ప్రజా సమస్యలపై స్థానికులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.