Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
కాంగ్రెస్ కార్యకర్తలను సుధీర్‌రెడ్డి ఫోన్లో బెదిరిస్తూ టీఆర్ఎస్లో చేర్చు కుంటున్నారని కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ లింగోజీగూడ డివిజన్ అధ్యక్షుడు తిలక్‌రావు అన్నారు. ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏ కాంగ్రెస్ నాయకునికి ఫోన్‌చేసి బెదిరించి టీఆర్ఎస్లో చేర్చు కున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలే తమకు బలమని, సుధీర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు నచ్చి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి తన పబ్బం గడుపుకోవడానికి సుధీర్‌రెడ్డి మీద చవకబారు ఆరోపణలు చేస్తున్నాడని, ఇది మానుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముద్రబోయిన శ్రీనివాసరావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని డివిజన్లో సుధీర్‌రెడ్డి చొరవతో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో వరప్రసాద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, చిత్రం సాయి పాల్గొన్నారు.