Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
జానపద సాహితీవేత్త ఆచార్య బిరుదరాజు రామరాజు జయంతి సమావేశం శ్రీత్యాగరాయగాన సభ లోని కళా సుబ్బారావు కళా వేదికపై గాన సభ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిధిగా మల్కాజిగిరి కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ వత్తిరీత్యా రామరాజు ఉపన్యాసాకుడైనా జానపద సాహిత్యం పై విశేష పరిశోధన చేసారని అన్నారు. ఆయన పలు గ్రంథకర్త అని వివరించారు సాహితీకిరణం మాస పత్రిక సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు మాట్లాడుతూ బిరుదరాజు రచించిన ఆంధ్ర యోగులు పరిశోధక విద్యార్థులకు ఉపయుక్తమని తెలిపారు. అధ్యక్షత వహించిన గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి మాట్లాడుతూ తెలుగు సాహితీమూర్తుల జయంతిలను గాన సభ ఆధ్యర్యంలో నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. నాట్య గురువు డాక్టర్ రత్నశ్రీ, శ్రీమణి పాల్గొన్నారు..