Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
సనత్నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు భవర్ లాల్ వర్మ మృతి పట్ల రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ప్రగాఢ సంతాపం తెలి పారు. భవర్ లాల్ వర్మ మరణించిన విషయం తెలుసుకున్న మంత్రి రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని మృతుడి ఇంటికి వెళ్లి మృతదేహం పై పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. భవర్లాల్ వర్మ మృతి బాధాక రమనీ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం, సానుభూతిని తెలిపారు.