Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్‌పేట
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కి చెందిన ఇషాంత్ క్రికెట్లో ప్రతిభ కనబరుస్తుండటంతో ప్రోత్సహంగా ఉప్పల ఫౌం డేషన్ ద్వారా ఇషాంత్‌కు రూ.20 వేలు అందజేసినట్టు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. శనివారం ఎల్బీనగర్లోని అయన నివాసంలో ఇషాంత్‌కు చెక్‌ను అందజేసి మాట్లాడారు. ఇషాంత్ క్రికెట్ లో రాణించడానికి, ప్రావీణ్యం పొందడానికి ఈ డబ్బులు ఉపయోగపడుతాయన్నారు. ఇషాంత్ క్రికెట్లో ప్రావీణ్యం పొంది రాష్ట్ర స్థాయిలో ఆడి గజ్వేల్ పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఏమైనా సహాయం కావాలంటే అందిసానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాన తర్వాతనే స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా క్రీడాకారులు, యూత్‌ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పా రు. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియాలను అభివృద్ధి చేయను న్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, సంపత్, నాయకులు హరిశ్చంద్ర ప్రసాద్, ప్రవీణ్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.