Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
వేసవి ఎండల తీవ్రత సమయంలో ప్రజల దాహర్తీని తీర్చడానికి విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చైర్మెన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. పోచారం మున్సి పాల్టీ పరిధిలోని అన్నోజిగూడ సంస్కతి టౌన్ షిప్ రోడ్డు లోని ప్లై ఓవర్ బ్రిడ్జి కింద చైర్మెన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను శనివారం వైస్ చైర్మెన్ నానావత్ రె డ్యా నాయక్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ యువజన సంఘాలు, స్వఛ్ఛంద సం స్థలు ప్రజల దాహర్తీని తీర్చడానికి ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సురేష్, టీఆర్ఎస్ మున్సి పాల్టీ అధ్యక్షుడు మందాడి సురేందర్‌రెడ్డి, సీనియర్ నాయ కులు బోయపల్లి సత్తిరెడ్డి, నాయకులు నల్లవెల్లి శేఖర్, బద్దం జగన్ మోహన్‌రెడ్డి, బోయపల్లి రాజేశ్వర్‌రెడ్డి, జితేం దర్ నాయక్, కొమ్ముల ప్రశాంత్, గుగులోత్ గోవింద్ నా యక్, లక్ష్మణ్ యాదవ్, మురళి, విక్రమ్‌గౌడ్, వినరురెడ్డి, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.