Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిమ్స్ ఫౌండర్ డైరెక్టర్ పద్మశ్రీ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతోపాటు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, డీన్ డాక్టర్ రామ్మూర్తి, మెడికల్ సూపరింటె ండెంట్ ఎక్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ నిమ్మ సత్యనారా యణ, వైద్య, ఆరోగ్య శాఖ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, ఇతర శాఖాధిపతులు, సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు శనివారం ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్, ఇతర డాక్టర్లు కాకర్ల సుబ్బారావు నిమ్స్‌కి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతించారు. సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో అక్కడికి విచ్చేసిన ప్రజాకవి గద్దర్ తనదైన స్టైల్లో నివాళ్లర్పించి ఆయన సేవలు, గొప్పతనాన్ని, రోగి దేవో భవ అన్న కాకర్ల సిద్దాంతాన్ని పాట రూపంలో శ్లాఘి ంచారు. ఈ సందర్భంగా మాజీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇతర ప్రముఖులు కొవిడ్ వాక్సిన్‌కు నిమ్స్‌ను సందర్శించిన సందర్భంలో కాకర్లకు నివాళ్లర్పిస్తూ వారి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. అనంతరం పలువురు నాయకులు, ఉద్యోగులు మాట్లాడుతూ ఈ సంస్థ ఆయన మానస పుత్రిక అనీ, ఆయన నడయాడిన ఈ నేలపై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ, ఆయన నేర్పిన క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం ఎప్పుడూ అందరికీ గుర్తు రావాలంటే ఆయన పేరును ఒక బ్లాక్‌కి గానీ, ఆయన విగ్రహాన్ని సంస్థలో ప్రతిష్ట చేయడం కానీ చేయాలని ప్రభుత్వం, నిమ్స్ యాజమాన్యాన్ని కోరారు. కాకర్ల సేవలు చిరస్మరణీయమనీ, చివరి శ్వాస వరకు నిమ్స్‌తో తన అనుబంధాన్ని వీడలేదనీ, ఎంత వయోభా రంతో బాధపడుతున్నా వారానికి రెండు సార్లు నిమ్స్ లెర్ని ంగ్ సెంటర్ లో జరిగే సైంటిఫిక్ ప్రోగ్రాంలకు విధిగా హాజరయ్యేవారని పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో సమయపాలనకు, పరిశుభ్రతకు ఎంత ప్రా ముఖ్యత ఇచ్చే వారు గుర్తు చేసుకున్నారు. నిరంతర అధ్య యనం వల్లే జ్ఞానం ఒక తరం నుంచి ఇంకో తరానికి విస్తరి స్తుందని ఆయన హయాంలోనే నిమ్స్ ఆడిటోరియంకి అధ్యయన కేంద్రం-లెర్నింగ్ సెంటర్ అని పేరు పెట్టడాన్ని వారు గుర్తు చేసుకున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడి యో గ్రాఫర్స్ ప్రెసిడెంట్ కె.దామోదర నాయుడు, ఎంఏ. వారిస్ కాకర్ల సేవలను కొనియాడారు. ఆయన పేరుపై ఇప్పటికే వైద్య విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు వివిధ గోల్డ్ మెడల్ ప్రోగ్రాంలు, అవార్డు కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు ఏర్పాటు చేశాయని తెలిపారు. కాకర్ల కుటుంబానికి నిమ్స్ యాజమాన్యం, సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. కాకర్ల ఎందరికో బతుకు తెరువు కల్పించిన మహానుభావుడు అని పలువురు ఉద్యోగులు మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మార్తా రమేశ్, నిమ్స్ పారామెడికల్ ఎంప్లాయీస్ నాయకులు శిరందాస్ శ్రీనివాస్, భరత్ భూషణ్, గిరిజ మనోహర్, సయ్యద్ గౌస్, నిమ్స్ తెలం గాణ ఉద్యోగుల సంఘం నాయకులు పొట్టబత్ని రాజకు మార్, కె.రాజకుమార్, బయోమెడికల్ శ్రీనివాస్, నర్సింగ్ యూనియన్ నాయకులు ఆశాలత, విజయ కుమారి, ఇతర అన్ని తరగతుల ఉద్యోగులు పాల్గొన్నారు.