Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఓయూ
రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా భయాందోళనకు గురి చేస్తోంది. వైరస్ సెకెండ్ వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా యి. అయినా చాలామంది కరోనా మార్గదర్శకాలను నిర్ణ క్ష్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా రైల్వేశాఖ పప్రమ త్తమైంది. ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే అన్ని చర్యలు చేపట్టింది. రైల్వే పరిసరాలో పరిశుభ్రతతో పాటు శానిటైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకా కుండా ప్రతి ప్రయాణికుడు కొవిడ్ నిబంధనలు పాటిం చేలా చర్యలు తీసుకుంది. కొవిడ్‌ను నివారించే విధంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాస్కులు పెట్టుకోని వారితోపాటు రైల్లో, రైల్వే పరిసరాల్లో ఉమ్మివేసి నా రూ.500 జరిమానా విధిస్తున్నారు. ప్రయాణికులదరూ తప్పని సరిగా స్టేషన్లలో, ప్రయాణ సమయంలో తప్పని సరిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు కోరుతున్నారు. సురక్షిత ప్రయాణం కోసం రైల్వే వారు చేస్తున్న కృషికి ప్రయాణికులందరూ బాధత్యతతో సహకరించాని అధికా రులు కోరుతున్నారు.