Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వందేండ్ల ఓయూ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తున్న సేవ్ ఓయూ లోగోను శనివారం ఓయూలో ముఖ్య అతిథిగా ఓఎస్డీ ప్రొ. క్రిష్ణారావు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ వందేండ్ల ఓయూ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాల న్నారు. ఓయూను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి చౌటి ప్రభాకర్ అధ్యక్షత వహించగా ఓయూ ప్రొఫెసర్స్ కంట్రోలర్ ప్రొ. శ్రీరాం వెంకటేష్, మాజీ ఇంజినీరింగ్ కళాశాల డీన్ ప్రొ. పి.లక్ష్మీ నారాయణ, చీఫ్ వార్డెన్ డా.కోర్రెముల శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘం నేత రాజేశ్వరరావు, అడ్వకేట్ డా. నవీన్ సౌడ, జర్నలిస్ట్ రఘు, విద్యార్థి సంఘాల నాయకులు స్వామి మాదిగ, తిరుమల్లేష్, వంగూరి సిద్దార్థ్, దివాకర్, గ్యార నరేష్, కాంపల్లి శ్రీనివాస్, హరీష్, సత్య,సాయి, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.