Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
గతంలో మాజీ కార్పొరేటర్స్కు కేటాయించిన వార్డు కార్యాలయాన్ని తనకు కేటాయించాలని హబ్సిగూడ కార్పొ రేటర్ కక్కిరేణి చేతన హరీష్ చేపట్టిన నిరసన శనివారం మూడో రోజుకు చేరుకుంది. ఆమె శనివారం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్న కార్యాలయానికి ఎదుట చెట్ల కింద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె అక్కడ నుంచే తన విధులు నిర్వహించారు. ఒక కార్పొరేటర్ రా జ్యాంగ బద్ధంగా తనకు కార్యాలయం కేటాయింపు చేయా లని కోరితే వేరే చోట, ఇంకో చోట కేటాయిస్తం అనటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అధికారులు అధికార పార్టీ వారికి కాకుండా ప్రజల తీర్పుతో గెలుపొ ందిన ప్రజాప్రతినిధులు ఇలా కేటాయించకుండా జాప్యం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు గతంలో కార్పొరేటర్స్ ఉన్న కార్యాలయంను కేటాయించే వరకు చెట్ట కింద నుంచే విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.