Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం రోజున కూకట్పల్లిలో ఉన్న రామాలయంలో ,ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యులతో రాబోయే శ్రీరామనవమి బ్ర హ్మౌత్సవాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహి ంచారు. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా మహమ్మారి విజంభిస్తున్న ఈ తరుణంలో.శ్రీరామనవమి పర్వదినాన భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పై .అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించే విధంగా చూడాలని. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ , సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకో వాలని ఈ సమావేశంలో సూచించారు. అలాగే 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు.స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ,వేద పండితులు పాల్గొన్నారు.