Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రయివేటీకరణ దేశద్రోహమని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్, ఓయూ ప్రొపెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా 65 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్న విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ, జై భీమ్ లాల్ సలాంకు శనివారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. రాజ్యాంగానికి విరు ద్ధంగా ప్రభుత్వ సంపదను ప్రయివేటు వ్యక్తులకు అమ్మడం దేశద్రోహం, ప్రజావ్యతిరేక విధానం అ న్నారు. అలాంటి విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి దేశాన్ని పరిపాలించే అధికారం లేదన్నారు. కేంద్ర ప్రభు త్వం ఉత్తరాదిని అంబానికి, దక్షిణాదిని అదానీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. వీరికి ఒక్క రోజు కూడా దేశాన్ని పాలించే అర్హత లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఐక్యమై విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలనీ, లేకుంటే తెలుగు రాష్ట్రాల మనుగడ రానున్న రోజుల్లో ప్రశ్నార్థకం అవుతుందన్నారు. తెలంగాణ మహిళా సమాఖ్య అధ్యక్షు రాలు చంద్రకళ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి 25 రోజులుగా కొనసాగు తున్న ఉద్యమానికి తమ సంఘీభావం తెలిపి ఒక్క రోజు దీక్షలో కూర్చుని మాట్లాడారు. ప్రయివేటీ కరణ పేరుతో పేద బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకుండా మెజార్టీ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.