Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పులుంటే సరిచేసుకోండి
- ఈ నెల 24వ తేదీలోపు సవరణకు ఛాన్స్
- వచ్చే నెలలో కార్డుల జారీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు త్వరలో గుర్తింపు కార్డులు అందనున్నాయి. రెండేండ్ల క్రితం జిల్లాలోని ఉపాధ్యాయులందరి వివరాల ను ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, డాటాఎంట్రీ ఆ పరేటర్లు సేకరించి యూడైస్‌లో నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం గతేడాది ఆగస్టు లో టీచర్లకు సంబంధించిన బ్లడ్‌గ్రూప్, ఇంటి చిరునామా, ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతోపాటు తప్పుల సవరణకు అవకాశం కల్పిం చారు. ఇలా జిల్లాలో దాదాపు 4,700కుపైగా ఉపాధ్యాయులు తమ వివరాలు నమోదు చేసు కున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తప్పొప్పు లను సవరించుకునేందుకుగాను ఈ నెల 24వ తేదీ వరకు గడువును విధిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇటీవల డీఈవోలకు ఆదే శాలు జారీ చేశారు. టీచర్లు నమోదు చేసుకున్న వివారాల్లో తప్పులు, సవరణలు ఉంటే మరోసారి సవరణ చేసుకునే అవకాశం కల్పించారు. తప్పు ల్లేవని 24వ తేదీలోపు టీచర్లతోపాటు డీఈవోలు సర్టిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు తప్పు గా ఇస్తే ఐడీ కార్డుల్లో తప్పుగానే వచ్చే ప్రమాద ముందనీ, దీనికి టీచర్లు, డీఈవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 684 ఉన్నాయి. వీటిల్లో 4,717 మంది ఉపాధ్యాయు లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) 2131, స్కూల్ అసిస్టెంట్లు 1937, గెజిటెడ్ హెడ్మాస్టర్లు 92, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు 140, లాంగ్వేజీ పండిట్లు 250, పీఈ టీలు 144, ఆర్ట్, క్రాప్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్లు 23 మంది ఉన్నారు. త్వరలో వీరంతా ఐడీ కార్డులు పొందనున్నారు. దాదాపు రెండేండ్లుగా టీచర్లకు ఐడీ కార్డులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతున్న వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగ లేదు. తాజాగా ప్రభు త్వం గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు డీఈ వోలకు ఆదేశాలు ఇవ్వడంతో రానున్న నెలరో జుల్లో కార్డులు అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ కార్డులో ఉపాధ్యాయుల వివరాలు ఉండటంతో ఏ పాఠశాల టీచర్లు అనేది సులువుగా తెలియడంతోపాటు నకిలీ టీచర్లకు చెక్ పడనుంది.