Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కట్టడికి డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్
- పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు
- చెత్త తొలగించే బాధ్యత డీసీ, మెడికల్ ఆఫీసర్లదే
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రతి సర్కిల్లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తిస్థాయిలో గార్బేజ్‌ను తొలగించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకుగాను అవసరమైన అదనపు వాహనాలు, డంపర్లు, టిప్పర్లను సమకూర్చుకోవాలని మంత్రి ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై రోజూ ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వ హించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పేరుకు పోయిన చెత్తను తొలగించడంతో పాటు డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ ముమ్మరంగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ విషయ మై మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో శనివారం సమీక్షిం చారు. మంత్రి ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ.. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ నిబంధనలను అనుస రించి నగరంలో డస్ట్బిన్లను తొలగించామ న్నారు. అయితే ఈ కేంద్రాల్లో ఏర్పడ్డ చెత్త తొల గింపు సంతృప్తికరంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి ఉదయం జోనల్, డిప్యూటీి కమిషనర్లు, ఏఎంహెచ్ఓలు క్షేత్రస్థా యిలో పర్యటించి గార్బేజ్‌ను తొలగించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్స్టేషన్లు, పార్కు లు, వ్యాపార ప్రాంతాల్లో గార్బేజ్ కనిపించ కూడదని పేర్కొన్నారు. బిన్ ఫ్రీ సిటీగా చేపట్టిన చర్యల వల్ల ఇంటింటి నుంచి చెత్త సేకరణ మరింత పెరగాలని, ఇందుకుగాను అవసరమైన అదనపు స్వచ్ఛ ఆటోలను పొందేందుకు మహీం ద్ర కంపెనీ యాజమాన్యంతో సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. రహదా రులు, వీధుల్లో చెత్త కనిపిస్తే ఏ మాత్రం సహిం చేదిలేదని, ఇందుకుగాను సంబంధిత ఏఎం హెచ్ఓలు, డిప్యూటీి కమిషనర్లను బాధ్యులను చేయడం జరుగుతుందని ముఖ్య కార్యదర్శి హెచ్చరించారు. ప్రధానంగా గార్బేజ్ వల్నరబుల్ కేంద్రాలపై ప్రధాన దృష్టి సారించాలని పేర్కొ న్నారు. చెత్త తొలగించిన కేంద్రాల వద్ద డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ చేపట్టాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి హ్యాండ్ గ్లోవ్స్‌లు, శాని టైజర్, మాస్కులను తప్పనిసరిగా అందించాలని అన్నారు. డంపింగ్ యార్డ్లు, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ స్టేషన్లలో గార్బేజ్ ఎత్తివేతలో ఏవిధ óమైన సమస్యలు తలెత్తకుండా వాటి స్థాయిని పెంచాలని సూచించారు. రానున్న నాలుగు రోజులు ఉద్యమరూపంలో గార్బేజ్ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.
డిఎస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్
కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని ప్రధాన కూడళ్లు, జనసంవర్థక ప్రాం తాలు, మార్కెట్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్‌ను చేపట్టా లని ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదేశిం చారు. డస్ట్బిన్లను తొలగించిన ప్రాంతాల్లో కూడా చెత్తను తొలగించిన అనంతరం స్ప్రేయింగ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు గాను ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావ కంతో కూడి స్ప్రేయింగ్‌ను క్రమం తప్పకుండా చేపట్టాలని అన్నారు. ఇందుకుగాను సోడియం హైపోక్లోరైట్‌తో పాటు అవసరమైన డిస్-ఇన్ఫెక్షన్ మందులను తగు మొత్తంలో ముందస్తుగా సేకరించాలని ఆదేశించారు. మతదేహాల వల్ల ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా ఉండేం దుకుగాను శ్మశానవాటికల్లో తగు నీటి లభ్యత, సరైన లైటింగ్ తదితర సౌకర్యాలను ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుండే నగరంలో ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, గార్బేజ్ తొలగింపుపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు. ప్రతి రోజు ఉదయం గార్బేజ్ తొలగించడానికి నియమించిన వాహనాలు సక్రమంగా వస్తున్నా యా? లేనిది సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లచే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.