Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని, అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఏప్రిల్-12న మన పండుగ ఉగాది పర్వదినాన్ని తెలుగు సంస్కతి వారసత్వదినంగా, అధికారికంగా గుర్తించిందని విశ్వ తెలుగు సాహిత్య సాంస్కతిక సభ అధ్యక్షులు వల్లూరు రమేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని మూలంగా తెలుగు భాషను అమెరికాలో అన్ని స్కూల్స్, కాలేజీలలో నేర్పించడానికి తెలుగులో పాఠ్యాంశాలు నిర్ణయించడం, ప్రవేశపెట్టడానికి వీలు కలుగుతుం దన్నారు. జార్జియా రాష్ట్రంలో తెలుగు భాషను ప్రస్తుతం బోధిస్తు న్నారన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ కెంప్ స్వహస్తాల మీదుగా అంతర్జాతీయ తెలుగు దీప్తి బిరుదును పొందడం సంతోషకర మన్నారు. జార్జియా రాష్ట్ర రాజ ముద్ర తెలుగు భాషకు అమెరికాలో గొప్ప సత్కారం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఎన్నో ఏళ్ల కృషి ఫలితమన్నారు. విశ్వ తెలుగు సాహిత్య సాంస్కతిక సభకు కలిగిన గొప్ప సదవకాశమని, ఇది చరిత్రలో నిలిచిపోయే సంఘటన అని ఆయన పేర్కొన్నారు.