Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీ నగర్
ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని లింగోజీ గూడ డివిజన్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఆకుల అఖిల్ గౌడ్ ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాల యంలో శనివారం నామినేషన్ వేసినారు. కాంగ్రెస్ అభ్యర్థి వందలాది మంది అభిమానులతో వెళ్లి తమ నామినేషన్ వేసినారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఆకుల అఖిల్ గౌడ్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసినారు. అదేవిధంగా ఒక స్వతంత్ర అభ్యర్థి షేక్ పర్వేష్ నామినేషన్ వేశారు. ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసినారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పోటీ నుండి తప్పుకొన్నది. బీజేపీ కార్పొరేటర్‌గా ఆకుల రమేష్ గౌడ్ గెలిచి ప్రమాణస్వీకారం చేయకుండానే మతి చెందడంతో లింగోజీ గూడలో ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉప ఎన్నిక జరుగుతుంది.