Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలాల పూడికతీత పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్.
నవ తెలంగాణ-ఉప్పల్
కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ పనులలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా పూడికతీత పనులలో సిల్ట్‌ని అంతా కూడా ఎప్పటికప్పడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొలగించాలని, అదే విధంగా ఇరిగేషన్ నాలాలకు సంబంధించిన పూడికతీత పనులు చాలా జాగ్రత్తగా చేయా లని, ముఖ్యంగా విశారట్ ఎనక్లేవ్ కల్వర్టు, రాఘవేంద్ర నగర్ కాలనీ కల్వర్టు మరియు కావేరి నగర్ కల్వర్ట్ దగ్గర పూడికతీత పనులు శ్రద్ధగా చేయాలని కాంట్రాక్టర్‌కి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఈ నిఖిల్ రెడ్డి, ఏఈ రాజకుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార, డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, టీిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్‌రావు, ఏదుల కొండల్‌రెడ్డి, కొంపల్లి రవీందర్, రామ్‌రెడ్డి, కొంపల్లి రాజ్‌కుమార్, మహమూద్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, బాలు, ఉపేందర్, సుందర్, పుష్పరాజ్ సంతోష్, శ్యామ్, అందాలమ్మ, సరిత, సైజాజ్ బేగం, సత్యవతి మరియు బస్తీవాసులు పాల్గొన్నారు.