Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయాంజల్
సహకార బ్యాంకులపై రైతులు పెట్టుకున్న నమ్మ కాన్ని నిలబెట్టుకునేలా అందరూ కషి చేయాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనో హర్రెడ్డి, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పిలుపునిచ్చారు. శనివారం అబిడ్స్‌లోని టీఎస్ సీఏబి ప్రధాన కార్యా లయంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ (హెచ్‌డీసీసీ బ్యాంకు లిమిటెడ్) మొబైల్ ఏటీఎం వ్యాన్లను టీఎస్సీఏబీ చైర్మన్ రవీందర్, హెచ్డిసిసి బ్యాంకు చైర్మన్ మనోహర్ రెడ్డి, కొత్తకుర్మ సత్తయ్య, నాబార్డ్ సీజీఎం వై.కష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీసీసీబీ ఆధ్వర్యంలో రైతుల ముంగిటకు మొబైల్ ఏటీఎం వ్యాన్లను తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. మొబైల్ ఏటీఎం వ్యాన్లను వికారాబాద్, పరిగి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీిఎస్సీఏ బీఎండీ ఎన్.మురళీధర్, హెచ్డిసీసీ బ్యాంకు జీఎం పి.ప్రభాకర్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.