Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాచకొండ పోలీసులు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్టు నమోదు చేశారు. శనివారం రాచ కొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు హర్యానా రాష్ట్రానికి చెందిన మహ్మద్ రంజాన్ గంజాయి స్మగ్లర్‌గా పెరుపొందాడు. హర్యానా, రాజస్తాన్‌కు చెం దిన మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుంచి రూ.3వేలకు కిలో గం జాయిని కొనుగోలు చేస్తున్న నిందితులు హైదరాబాద్ తోపాటు ఉత్తరప్రదేశ్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నా డు. లారీల్లో తరలిస్తున్న నిందితులు కావాల్సిన వారికి, తెలిసిన వారికి రూ.9వేలకు కిలో చొప్పున గంజాయిని అందిస్తున్నారు. ఈ ముఠాను ఎస్వోటీ బృందాలు పలు సార్లు అరెస్టు చేశాయి. జైలు నుంచి బయటకు వస్తున్న నిందితులు తిరిగి గంజాయిని సరఫరా చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవ డంతో ప్రధాన నిందితుడైన రంజాన్‌పై పీడీ యాక్టు నమోదు చేశారు.