Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా క్లాసులు చెప్తూ ప్రయివేట్ పాఠశాలలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగరి వెంకటేష్ అన్నారు. తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరెడ్మెట్ దీనదయాళ్నగర్లోని పాషా పబ్లిక్స్కూల్లో యాజమాన్యం కొవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా పాఠాలు చెప్పిస్తోందని తెలిపారు. తరగతులు బోధిస్తూ విద్యార్థులపై, తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి తెస్తోందన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.