Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సోషల్ మీడియా వేదికగా అమాయకులను ఎంచుకుని గిఫ్ట్‌లు, విదేశీ కరెన్సీనీ పంపిం స్తామని అందినకాడికి దోచుకుటున్న నైజీరియాకు చెందిన ఫుడ్‌బాల్ కోచ్‌తోపాటు అతనికి సహకరించిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీ సులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్, డెబిట్ కార్డుతోపాటు రూ.16000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల మేరకు నైజీరియాకు చెందిన హెన్రీ చుక్వువి ఓపెరా ఢిల్లీలో ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. శస్త్రచికిత్స కోసమని భారత్‌కు వచ్చిన హెన్రీ కర్నాటాకాకు చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకుని న్యూఢిల్లీలో నివాసముటున్నాడు. అందులో వస్తున్న సంపాదన సరిపోకపోవడంతో న్యూ ఢిల్లీలో నివాసముంటున్న చీమా ఫ్రాంక్, ముఘష్ యాప్టోతో కలిసి ఆన్లైన్ మోసాలకు తెరలేపాడు. సోషల్ మీడియాలో పరిచయాలు చేసుకుని గిఫ్ట్‌లు పంపిస్తా మని, రుణాలిపిస్తామని నమ్మిస్తున్నారు. అంతటితో ఆగకుండా విదేశీ కరెన్సీని పంపిస్తామని అమాయకుల ను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత మీకు విలువైన గిఫ్ట్ వచ్చిందని, లేదా భారీ ఎత్తున విదేశీ కరెన్సీ వచ్చిందని ఢల్లీ ఏయిర్పోర్టు నుంచి ఫోన్చేస్తున్నట్టు మాట్లాడు తారు. జీఎస్టీ, కస్టమ్స్‌తోపాటు వివిధ పన్నులు చెల్లిం చాలని అందినకాడికి వసూలు చేస్తున్నారు. ఇదే తరహా లో గతేడాది డిసెంబర్లో నగరానికి చెందిన ఓ యువ కునికి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నారు. మీకు విలు వైన గిఫ్ట్‌తోపాటు, యూకే కరెన్సీని పంపిస్తామని నమ్మిం చారు. తిరిగి రెండు రోజుల అనంతరం ఢిల్లీ ఏయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి పరిచయం చేసుకున్నారు. మీకు విలువైన గిఫ్ట్ వచ్చిందని వివిధ పన్నులు చెల్లించాలని నమ్మించిన ఈ ముఠా దాదాపు రూ.18లక్షలను వివిధ బ్యాంక్ అకౌంట్స్‌లో డిపాజిట్ చేయించుకుంది. ఇదే తరహాలో ఈ ముఠా వందలాది మందిని మోసం చేసి లక్షల్లో వసూలు చేసింది. బాధి తుల ఫిర్యాదుతో ఏసీపీ ఎస్.హరినాథ్ ఆదేశాలతో ఇన్ స్పెక్టర్ విజరు కుమార్ విచారణ చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న ప్రకటనలను పూర్తిగా నమ్మవద్దని సీపీ తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్ట్రా గ్రామ్, వాట్సాప్ తదితర వాటిల్లో పరిచయమైన వారు గిఫ్ట్‌లు, కరెన్సీ పంపిస్తామంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.