Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలనీ, ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్‌తో కలిసి శనివారం పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రాజేంద్ర నగర్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్ సర్కిళ్ల పరిధిలోని శాస్త్రిపురం, కాలాపత్తర్, బో స్బెన్ స్కూల్, వట్టేపల్లి, ఆశామాబాద్, చాంద్రాయణ గుట్ట, బాబానగర్, సన్నీ గార్డెన్, రక్షాపురం, మొయి న్‌బాగ్, ఈదిబజార్, భవానీనగర్, తలాబ్‌కట్ట, మొఘ ల్ పుర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు. ఓపెన్ పా యింట్ల వద్ద ప్రతిరోజూ మూడు ట్రిప్పులతో చెత్తను తొలగించాలన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరిం చడానికి మరిన్ని స్వచ్ఛ ఆటో టిప్పర్లను కేటాయిం చాలన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేం దుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలందరూ చెత్తను రోడ్లపై వేయకుండా ఇంటివద్దకు వచ్చే స్వచ్ఛ ఆటో టిప్పర్ సిబ్బందికి చెత్తను అందజేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు రా కుండా ఉంటాయన్నారు. అనంతరం జోనల్ కమిష నర్ సామ్రాట్ అశోక్ మాట్లాడుతూ... ఇంటింటికీ చెత్త సేకరించేందుకు జోన్ పరిధిలో 384 ఆటోలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో స్వచ్ఛ ఆటో టిప్పర్లతో చెత్త సేకరిస్తున్నామని చెప్పా రు. ఓపెన్ పాయింట్లలో పోగవుతన్న చెత్తను ప్రత్యేక వాహనాలతో తొలగిస్తున్నామని తెలిపారు. పారిశుధ్య సమస్యల పరిష్కారాకి తాము చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు సహరించాలని కోరారు. ఈ పర్యటనలో ఫల క్‌నుమా, రాజేంద్రనగర్, చార్మినార్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు డి.జగన్, ఎస్ఎన్ సూర్య కుమార్, ఏఏంహెచ్ఓలు డాక్టర్ పద్మ, డాక్టర్ పాల్వాన్ కుమార్, రవాణా విభాగం డీసీటీవో వినరు భూషణ్, ఏఈ తదితరులు పాల్గొన్నారు.