Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
అల్లాపూర్ 116 డివిజన్ పరిధిలోని సఫ్దర్నగర్లో నిర్మాణంలో ఉన్న నాలాకు సమీపంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టరాదని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తెలిపారు. కొన్ని రోజుల క్రితమే వారికి నాలా పనులు ప్రారంభమైతే, నాలాను ఆనుకుని ఉన్న నిర్మాణాలను కూల్చేశామనీ, నాలా నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా వెనక్కి నిర్మించాలని నిర్మాణదారులకు సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ మేరకు నిర్మాణదారులతో వార్డు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి తెలిపారు.