Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ఆపద కాలంలో తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండడం తన బాధ్యత అని బోడుప్పల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధి వివిధ కాలనీల్లో కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గతేడాది కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి, పేదలకు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి తన ఉదారతను పంచుకున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న సందర్భంలో తన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిత్యం డివిజన్లో పర్యటిస్తూ ప్రజలను వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గాను చైతన్యం చేస్తూ అవసరమైన వారికి మాస్క్ లు అందిస్తున్నారు. ఎవరైనా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఉంటే వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులను అందించేలా ఏర్పాటు చేశానని తెలిపారు. సేవా కార్యక్రమాలతో పాటు డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలో మేడిపల్లి పోలీసు స్టేషను వారి ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు తోడ్పాటును అందించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.