Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మీర్పేట్, హెచ్‌బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్‌తో కలిసి హెచ్.బి. కాలనీ మెయిన్ రోడ్ పరిసర ప్రాంతాల్లో సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, గరికసుధాకర్, కిరణ్‌కుమార్‌రెడ్డి, బాలరాజు, నవీన్‌గౌడ్, సాయికుమార్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఎన్‌రెడ్డిలో ...
కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి డివిజన్లోని బీఎన్‌రెడ్డిలో ఎంటామాలజీ సిబ్బందితో కలిసి సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణంతో శానిటైజేషన్ చేయించారు. కాలనీల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే కాలనీలో చెత్తా చెదారం లాంటివి ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తనకు తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. కొవిడ్ సమయంలో అందరూ సహకరించుకోవాలన్నారు.