Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
కరోనా వైరస్‌ను అంతం చేయడానికి పౌర సమాజం పాత్ర కీలకమని వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ నవీన్ వల్లమ్ తెలిపారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లో వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై అవగాహన, దాని వ్యాప్తిని నివారించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రక్షణయే ఉత్తమమైన మార్గమని, ఈ ప్రచార వాహనాన్ని రూపొందించామన్నారు. దీనిపై ఉన్న 'స్పీకర్ బాక్స్ ల' ద్వారా కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, ప్రజారోగ్య సందేశాలను అందిస్తామని, అలాగే ట్రస్ట్ సభ్యులు ప్రేరణ బందాలుగా ఏర్పడి ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరుగుతూ ప్రజలకు కోవిడ్ ముప్పు, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు గ్లోవ్స్, మెడికల్ మాస్క్‌లు, రెస్పిరేటర్లు, గాగుల్స్, ఫేస్ షీల్డ్స్ ధరించడం వంటి వాటిపై, వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.