Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ నిర్మాణం కూల్చివేస్తుండగా అడ్డుకోవడంతో ఆగ్రహం
నవతెలంగాణ-బాలానగర్
అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ బృందంపై ఓ కార్పొరేటర్ అనుచరుడు సురేందర్ నాయుడు దాడికి యత్నించాడు. మూసాపేట సర్కిల్, ఫతేనగర్ డివిజన్ పరిధిలోని బొజై కల్యాణ మండపం ఎదురుగా పక్వాన్ హౌటల్ వెనుకాల ప్రభుత్వ నాలా స్థలంలో ఓ నిర్మాణ దారుడు పర్మిషన్ లేకుండా అక్రమంగా భవన నిర్మాణం చేపట్టాడు. స్థానికులు జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు శుక్రవారం డుమాలిషింగ్ స్క్వాడ్‌తో వచ్చి కూల్చివేతను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ అనుచరుడు అక్కడికి చేరుకుని కూల్చివేత చేపట్టిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించాడు. కూల్చివేతల విదానాన్ని వీడియో తీస్తున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతూ హల్చల్ చేశాడు. ప్రభుత్వ నాలా స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న వైనాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫతేనగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ అనుచరుల ఆగడాలు శృతిమించుతున్నాయని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.